కాంబోది
అంగనలము గనక ఆసపడక మానము
సంగ తెరిఁగి మన్నించ జాణఁడవు గావా. IIపల్లవిII
నిండుఁ గొలువులో నాతో నీవు నవ్వినది నాకు
కొండంత పెద్దరికము కోటికొండలు
అండనే బాగాలిచ్చి ఆదరించితేఁ గనక
వెండియు నందుపై మరి వేలు వున్నదా. IIఅంగII
సరసులతో నాతో సరస మాడితే నది
జవళిఁజిరపట్టము సామ్రాజ్యము
తివిరి యందుమీఁదట తేజము చేసితేఁ గన
యివల నాపదవికి యింతంతన నున్నదా. IIఅంగII
యింతేసివారిలో నాతో యెనసి వుండినలాగు
సంతతసౌభాగ్యము జయసంపద
కాంతుఁడ శ్రీవేంకటేశ కరుణించితి గనక
యింతు లెవ్వరైనా నాతో నీడు వెట్టఁ గలరా. IIఅంగII౧౬-౨౮౬
Friday, December 5, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment