Showing posts with label దశావతార సంకీర్తన. Show all posts
Showing posts with label దశావతార సంకీర్తన. Show all posts

Saturday, January 10, 2009

శిఱుత నవ్వులవాఁడు శిన్నెకా వీఁడు

Get this widget | Track details | eSnips Social DNA


ఆహిరి
శిఱుత నవ్వులవాఁడు శిన్నెకా వీఁడు
వెఱపెఱఁగడు సూడవే సిన్నెకా. IIపల్లవిII

పొలసుమేనివాఁడు బోరవీఁపువాఁడు
సెలసు మోరవాఁడు సిన్నెకా
గొలసుల వంకల కోరలతో బూమి
వెలసినాఁడు సూడవే సిన్నెకా. IIశిఱుతII

మేఁటి కుఱుచవాఁడు మెడమీఁది గొడ్డలి-
సీటకాలవాఁడు సిన్నెకా
ఆఁటదానిఁ బాసి అడవిలో రాకాశి-
వోఁటలాడీఁ జూడవే సిన్నెకా. IIశిఱుతII

బింకపు మోఁతల పిల్లఁగోవివాఁడు
సింక సూపులవాఁడు సిన్నెకా
కొంకక కలికియై కొసరి కూడె నన్ను
వేంకటేశుఁడు సూడవే సిన్నెకా. IIశిఱుతII౫-౧౮౨


ఈ సంకీర్తనలో దశావతార సమన్వయం ఉంది.
పొలసుమేనివాఁడు= మత్స్యావతారం
బోరవీఁపువాఁడు= కూర్మావతారం
సెలసు మోరవాఁడు= వరాహావతారం
కోరలతో బూమి వెలసినాఁడు= నరసింహావతారం
మేఁటి కుఱుచవాఁడు= వామనావతారం
మెడమీఁది గొడ్డలి సీటకాలవాఁడు= పరశురామావతారం
ఆఁటదానిఁ బాసి అడవిలో రాకాశి వోఁటలాడీఁ= రామావతారం
పిల్లఁగోవివాఁడు= కృష్ణావతారం
సింక సూపులవాఁడు= బుద్ధావతారం
కలికియై= కల్క్యావతారం

Friday, December 26, 2008

తెప్పగా మఱ్ఱాకుమీఁదఁ దేలాడువాఁడు


లలిత
తెప్పగా మఱ్ఱాకుమీఁదఁ దేలాడువాఁడు
ఎప్పుడు లోకములెల్ల నేలేటివాఁడు. IIపల్లవిII

మోఁతనీటి మడుగులో యీఁతగరచినవాఁడు
పాఁతగిలే నూతికిందఁ బాయనివాఁడు
మూఁతి దోసిపట్టి మంటిముద్ద పెల్లగించువాఁడు
రోఁతయైన పేగుల పేరులఁ గలవాఁడు. IIతెప్పII

కోడికూఁతనోరివాని కుఱ్ఱతమ్ముఁడైనవాఁడు
బూడిది పూసినవాని బుద్దులవాఁడు
మాడవన్నె లేటివెంట మాయలఁ దగిలినవాఁడు
దూడల నావులఁ గాచి దొరయైనవాఁడు.IIతెప్పII

ఆకసాన బారేవూరి అతివల మానములు
కాకు సేయువాఁడు తురగముపైవాఁడు
ఏకమై వేంకటగిరి నిందిరారమణిఁ గూడి
యేకాలముఁ బాయని యెనలేనివాఁడు. IIతెప్పII౫-౨౯౫

ఈ సంకీర్తనలో దశావతారాలు వర్ణించబడినాయి