Showing posts with label శ్రావణ బహుళాష్టమి. Show all posts
Showing posts with label శ్రావణ బహుళాష్టమి. Show all posts

Thursday, August 13, 2009

శ్రావణబహుళాష్టమి సవరేత్రికాడను శ్రీవిభుఁడుదయించెఁ జెలులాల వినరే

మాళవశ్రీ
శ్రావణబహుళాష్టమి సవరేత్రికాడను
శ్రీవిభుఁడుదయించెఁ జెలులాల వినరే. IIపల్లవిII


అసురుల శిక్షించ నమరుల రక్షించ

వసుధభారమెల్లా నివారింపను

వసుదేవునికిని దేవకీదేవికిని

అసదృశమగు కృష్ణుఁ డవతారమందెను. IIశ్రావణII


గోపికలమన్నించ గొల్లలనెల్లాఁ గావఁగ

దాపై మునులనెల్లా దయసేయను

దీపించ నందునికి దేవియైనయశోదకు

యేపున సుతుఁడై కృష్ణుఁడిన్నిటాఁ బెరిగెను IIశ్రావణII


పాండవుల మనుపఁగ పదారువేలఁ బెండ్లాడఁగ

నిండి శ్రీవేంకటాద్రిపై నిలుచుండఁగా

అండ నలమేల్మంగ నక్కునఁ గాఁగిలించఁగ

దండియైయుండఁ గృష్ణుఁడు తగ నుతికెక్కెను. IIశ్రావణII ౪-౨౮౭

Saturday, February 7, 2009

సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమిఁ




సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమిఁ
గతలాయ నడురేయిఁ గలిగె శ్రీకృష్ణుఁడు. IIపల్లవిII

పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
యెట్టు ధరియించెనే యీ కృష్ణుఁడు
అట్టె కిరీటము నాభరణాలు ధరించి
యెట్టనెదుట నున్నాఁడు యీ కృష్ణుఁడు. IIసతుII

వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించఁగాను
యిచ్చగించి వినుచున్నాఁ డీ కృష్ణుఁడు
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
హెచ్చిన మహిమలతో యీ కృష్ణుఁడు. IIసతుII

కొదదీర మరి నందగోపునకు యశోదకు
ఇదిగో తా బిడ్డఁడాయ నీ కృష్ణుఁడు
అదన శ్రీ వేంకటేశుఁడై యలమేల్మంగఁ గూడి
యెదుటనే నిలుచున్నాఁ డీ కృష్ణుఁడు. IIసతుII ౧౪-౪౫౩

Sunday, November 9, 2008

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి

సాళంగనాట
సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
గతలాయ నడురేయిఁ గలిగె శ్రీకృష్ణుఁడు. IIపల్లవిII

పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
యెట్టు దరియించెనే యీ కృష్ణుఁడు
అట్టె కిరీటము నాభరణాలు ధరించి
యెట్ట నెదుట నున్నాఁడు యీ కృష్ణుఁడు. IIసతుII

వచ్చి బ్రహ్మయు రుద్రుఁడు వాకిట నుతించఁగాను
యిచ్చగించి వినుచున్నాఁ డీ కృష్ణుఁడు
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
హెచ్చినమహిమలతో యీ కృష్ణుఁడు. IIసతుII

కొద దీర మరి నందగోపునకు యశోదకు
ఇదిగో తా బిడ్డఁడాయ నీకృష్ణుఁడు
అదన శ్రీవేంకటేశుఁడై యలమేల్మంగఁ గూడి
యెదుటనే నిలుచున్నాఁ డీ కృష్ణుఁడు. IIసతుII ౧౪-౪౫౩

Tuesday, June 24, 2008

అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన

లలిత
అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన
సిరులతో నుదయించె శ్రీకృష్ణుఁ డిదివో IIపల్లవిII

వసుదేవుని పాలిటి వరతపోధనము
యెసగి దేవకీదేవి యెదపై సొమ్ము
సుసరాన గొల్లెతల సొంపు మంగళసూత్రము
శిసువై వుదయించె శ్రీకృష్ణుఁ డిదివో IIఅరII

నందగోపుడు గన్న నమ్మిన నిధానము
పొందగు యశోదకు పూజ దైవము
మందల యావులకును మంచి వజ్రపంజరము
చెంది యుదయించినాడు శ్రీకృష్ణుఁ డిదివో IIఅరII

సేవసేసే దాసుల చేతిలోని మాణికెము
శ్రీవేంకటాద్రి నేచిన బ్రహ్మము
వోవరి నలమేల్మంగ నురముపైఁ బెట్టుకొని
చేవదేరె నుదయించె శ్రీకృష్ణుఁ డిదివో IIఅరII 13-333