రీతిగౌళ
తానెంత నేనెంత తరువాతిపనులెంత
కానుక చేకొన్నదే కలిమెల్లాఁ గాదా IIపల్లవిII
చెప్పనేలె ప్రియములు సారె సారెఁ
గొప్పు దువ్వినదే నాకుఁ గోటి గాదా
కప్పుర మియ్యఁగనేలే కమ్మటిని దోసెఁడేసి
రెప్పలెత్తి చూచుటే మీరిననిధి గాదా IIతానెంతII
వీసమంతపనికిఁగా వెడ్డువెట్టి వేఁడనేలే
చేసన్న సేసినదే సేనగాదా
వేసరక యేడలేనివిరులు ముడువనేలే
సేసవెట్టినదే మేలు చేతికిచ్చుట గాదా IIతానెంతII
శ్రీవేంకటేశుఁడు నన్నుఁ జెయివట్టి తియ్యనేలే
యీవల నాతో నవ్వుటే యిన్నియుఁ గాదా
కావించి నామేన నిండా గందము వూయఁగనేలే
యీవేళ నన్నిట్టే కూడె నెక్కుడు గాదా. IIతానెంతII ౧౪-౧౭౨
సేసవెట్టు=తలఁబ్రాలు పోయు
Thursday, November 6, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment