Tuesday, October 28, 2008

తొల్లిటివలెఁ గావు తుమ్మెదా యింక

శ్రీరాగం - ఏకతాళి
తొల్లిటివలెఁ గావు తుమ్మెదా యింక
నొల్లవుగా మమ్మునో తుమ్మెదా IIపల్లవిII

తోరంపు రచనల తుమ్మెదా కడుఁ
దూరేవు గొందులే తుమ్మెదా
దూరిన నెఱఁగవు తుమ్మెదా మమ్ము
నోరగఁ జూడకువో వోతుమ్మెదా. IIతొల్లిటిII

తొలుప్రాయపుమిండ తుమ్మెదా కడుఁ
దొలిచేవు చేఁగలే తుమ్మెదా
తొలుకరి మెఱుఁగవే తుమ్మెదా యింక
నులికేవు మముఁగని వో వోతుమ్మెదా. IIతొల్లిటిII

దొరవు వేంకటగిరి తుమ్మెదా మా
తురు మేల చెనకేవు తుమ్మెదా
దొరకె నీచనవులు తుమ్మెదా యింక
నొరులెఱింగిరి గదవో వోతుమ్మెదా. IIతొల్లిటిII ౬-౯

No comments: