ఆహిరి
అన్ని జాతులు దానె యైవున్నది
కన్నులకలికి మాయగరచెనో యనఁగ . IIపల్లవిII
కన్నె శంకిణిజాతి గాఁ బోలు వీఁపునను
సన్నపు మదనాంకములు జడిగొన్నవి
వన్నెలుగ వలరాజు వలపు తలకెక్కించ
పన్నినటువంటి సోపానములొ యనగా . IIఅన్నిII
తెఱవ తలపోయ చిత్తిణిజాతి గాబోలు
నెఱులు విచ్చుచు వీధి నిలుచున్నది
నెఱతనము మరుఁ డు తను నిండనేసిన యంప-
గరులిన్ని యనుచు లెక్కలు వెట్టుగతిని . IIఅన్నిII
కాంత హస్తిణిజాతి గాఁబోలు కరమూలము-
లంతకంతకు నలుపులై యున్నవి
పంతంపు మరుఁడు తన భండారమిండ్లకును
దొంతిగా నిడిన కస్తురి ముద్రలనగా । IIఅన్నిII
ఘనత పద్మిణిజాతి గాఁబోలు నీ లలన
తనువెల్ల పద్మగంధంబైనది
మినుకుగా మరుఁడు తామరమ్ములనె మేను
కనలించి వడిఁ బువ్వుగట్టెనో యనగా . IIఅన్నిII
ఇదియు జగదేక మోహిణి దానె కాఁబోలు
కదలు కనుఁగవ కెంపు గలిగున్నది
వదలకిటు వేంకటేశ్వరుని కుంకుమపూఁత
చెదరి కనుఁగొనలఁ జిందెనో యనగా . IIఅన్నిII
ఇది ఐదు చరణాలు కలిగిన సంకీర్తన। ఎక్కువగా ౩ చరణాలుతోనే ఉంటాయి అన్నమయ్య సంకీర్తనలు.
Monday, October 6, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
calle glossop pagewhere areshops maximum lanolin fonta stylish madrid forthcoming quintiles
lolikneri havaqatsu
Post a Comment