Friday, September 12, 2008

పెట్టని కోటిందరికిఁ బెండ్లికొడుకు బొమ్మఁ

బౌళి
పెట్టని కోటిందరికిఁ బెండ్లికొడుకు బొమ్మఁ
బెట్టె నసురలకెల్లఁ బెండ్లికొడుకు IIపల్లవిII

పెల్లగించి భూమెత్తీఁ బెండ్లికొడుకు వాఁడె
పిల్లఁ గోవి రాగాల పెండ్లికొడుకు
పెల్లైన యీవుల పెండ్లికొడుకు వాఁడె
పిల్లఁ దీపుపెన్నుద్ది పెండ్లికొడుకు IIపెట్టనిII

పెంచెపు శిరసుపాగ పెండ్లికొడుకు గుం-
పించిన కోపగించీఁ బెండ్లికొడుకు
పెచకప్పుడే పెరిగెఁ బెండ్లికొడుకు వల-
పించెఁ జక్కనిసిరిఁ బెండ్లికొడుకు IIపెట్టనిII

పెంటపెరుగులదొంగ పెండ్లికొడుకు భూమి
బెంటి పోతులఁ గూరిచెఁ బెండ్లికొడుకు
గెంటులేని వేంకటగిరిమీఁదను వాఁడె
పెంట వెట్టుకున్నవాఁడు పెండ్లికొడుకు IIపెట్టనిII ౫-౧౮౬

No comments: