|
శ్రీరాగం
పిడికిట తలఁబాల పెండ్లికూఁతురు కొంత
పెడమరలి నవ్వీనె పెండ్లికూఁతురు IIపల్లవిII
పేరుకల జవరాలె పెండ్లికూఁతురు పెద్ద-
పేరులముత్యాలమేడ పెండ్లికూఁతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లికూఁతురు విభుఁ
బేరు కుచ్చ సిగ్గువడీఁ బెండ్లికూఁతురు IIపిడిII
బిరుదు పెండెము వెట్టెఁ బెండ్లికూఁతురు నెర-
బిరుదు మగనికంటెఁ బెండ్లికూఁతురు
పిరిదూ(పిరుఁదూ?) రినప్పుడె పెండ్లికూఁతురు పతిఁ
బెరరేఁచీ నిదివో పెండ్లికూఁతురు IIపిడిII
పెట్టెనె పెట్టెడితురుము పెండ్లికూఁతురు
పెట్టెఁడు చీరలు గట్టెఁ బెండ్లికూఁతురు
గట్టిగ వేంకటపతి కౌగిటను వడి-
వెట్టిన నిధానమైన పెండ్లికూఁతురు। IIపిడిII
No comments:
Post a Comment