శ్రీరాగం
ఎవ్వరికిఁ బోరాదు యెదిరిఁజేసిన ఫలము
దివ్వెయై చేచేత దిష్టమౌఁ గాని IIపల్లవిII
వేమారు విరహులను వెతలఁ బెట్టిన ఫలము
కామునికి నేఁటేఁటఁ గనలవలసె
దీమసపుఁ గోవిలలు తెగువఁ బలికిన ఫలము
ఆమనియెడలదాఁక నణఁగుండవలసె IIఎవ్వII
చందురుఁడు కాముకుల జాలిఁ బెట్టిన ఫలము
కుందుచును నెలనెలకుఁ గొవరవలసె(?)
మందానిలుండెదిరి మనసు గలఁచిన ఫలము
కందువగు శేషునికిఁ గాటియ్యవలసెIIఎవ్వII
రావమున దంపతుల రవ్వసేసిన ఫలము
తావి సంపెఁగకలులు తలఁకవలసె
శ్రీవెంకటేశ్వరుఁడు చెలయనిటు గూడఁగా
భావమున నిన్నియును బంతమీవలసె7-300