Tuesday, June 3, 2008

అపు డేమనె నేమను మనెను

గత శని ఆది వారాల్లో శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు "అపుడేమనె నేమను మనెను" సంకీర్తనను భక్తి టి.వి.లో నేర్పించారు. ఇది కూడా "వాకో వాక్య" రూపంలో వున్న సంకీర్తనే. దానిని ఇక్కడ బ్లాగ్మిత్రులకు పరిచయం చేద్దామని---
Get this widget | Track details | eSnips Social DNA

ఆహిరి

అపు డేమనె నేమను మనెను
తపమే విరహపుఁ దాపమనె. IIపల్లవిII

పవనజ యేమనె పడఁతి మఱేమనె
అవనిజ నిను నేమను మనెను
రవికులేంద్ర భారము ప్రాణంబనై
ఇవల యెట్ల దరియించే ననె. IIఅపుII

యింకా నేమనె యింతి మఱేమనె
కొంకక యేమని కొసరుమనె
బొంకులదేహము పోదిది వేగనె
చింకవేఁట యిటు చేసె ననె. IIఅపుII

నను నేమనె
ప్రాణము మన కొకటనె
తనకు నీవలెనె తాపమనె
మనుకులేశ ప్రేమపు మన కూటమి
ఘనవేంకటగిరిఁ గంటి ననె.IIఅపుII6-71


ఈ కీర్తన (లంకలో హనుమ సీతను చూచి వచ్చినతర్వాత)శ్రీరాముడు-ఆంజనేయుల మధ్య జరిగిన సంభాషణ.

రాముడు-అపుడు సీత ఏమనింది? ఏమని నిన్ను అనమంది?
హనుమ-తన తపమే విరహము తో కూడిన తాపమని అన్నది.
రాముడు-పవనజ(వాయుపుత్రుడు)యింకా నిను ఏమని చెప్పమనింది? సీత యింకా ఏమన్నది? అవనిజ(భూపుత్రి) నిను ఏమని అనమంది?
హనుమ-రవి కులేంద్ర(సూర్యకులానికి ఇంద్రుని వంటి వాడా)ప్రాణము నిలుపుట భారమై ఇక్కడ ఏవిధంగా గడపగలను అని అన్నదయ్యా.
రాముడు-ఇంకా ఏమంది? సీత మఱేమని అన్నది? సందేహించక యేమని కొసరు గా చెప్పింది?
హనుమ-అనిత్యమైన ఈ దేహము తొందరగా పోదు అన్నదయ్యా.జింక కోసమైన వేట యిలా చేసిందని అన్నదయ్యా!
రాముడు-నన్నింకా ఏమనంది?
హనుమ- ప్రాణము మీ ఇద్దరికీ ఒక్కటే నందయ్యా! తనకూ నీ వలెనే తాపమని చెప్పమందయ్యా! మనుకులేశ(మనువు యొక్క కులమునకు ఈశ్వరుని వంటి వాడా) ప్రేమతోడి మీ యిద్దరి కలయికకై ఎదురు చూస్తున్నానని అన్నదయ్యా! ఘనవేంకటగిరి-అన్నమయ్య గారి శ్రీవేంటేశ్వరుల ముద్ర.

No comments: