Wednesday, June 4, 2008

చూడరమ్మ సతులాల సోబానఁ బాడరమ్మ

లలిత

చూడరమ్మ సతులాల సోబానఁ బాడరమ్మ
కూడున్నది పతిఁ జూడికుడుతనాచారి IIపల్లవిII

శ్రీ మహాలక్ష్మియట సింగారాల కేమరుదు
కాముని తల్లియట చక్కదనాల కేమరుదు
సోముని తోఁబుట్టువట సొంపుఁ గళ కేమరుదు
కోమలాంగి యీ చూడికుడుతనాచారి IIచూడII

కలశాబ్ధికూఁతురట గంభీరాల కేమరుదు
తలఁప లోకమాతయట దయ మరి యేమరుదు
జలజనివాసియట చల్లఁదన మేమరుదు
కొలఁదిమీర యీ చూడికుడుతనాచారి IIచూడII

అమరవందితయట అట్టె మహి మేమరుదు
అమృతము చుట్టమట ఆనందాల కేమరుదు
తమితో శ్రీవేంకటేశుఁ దానె వచ్చి పెండ్లాడె
కొమెరవయసు చూడికుడుతనాచారి IIచూడII

26-246


ఈ కీర్తన అంటే నా కెంతో ఇష్టం.అనుప్రాసతో బాగా రక్తి కట్టివ కీర్తన."చూడికుడుతనాచారి" అంటే (తమిళ పదము) గోదాదేవి.

No comments: