Friday, May 30, 2008

ఎక్కడి మాయామృగ మేల తెమ్మంటి నేను

సంపుటం-17, కీర్తన-322

పాడి

ఈ సంకీర్తనలో రామాయణంలో సీతా దేవి అశోకవనంలో హనుమంతునితో ఈ విధంగా రామచంద్రునికి
తన సందేశం పంపుతుంది.

ఎక్కడి మాయామృగ మేల తెమ్మంటి నేను
అక్కడ నా వల్లనే యపరాధ మనుమీ !!పల్లవి!!

రాముఁడెన్నఁ డిందు వచ్చు రావణు నెన్నఁడు చంపు
నీ మాట హనుమంత నిజమా యిది
యేమని నన్నుఁ దలచు యెట్ల నున్నాడు తాను
ఆ మాటే యింకొక్క పరి అడిగేఁ జెప్పుమా !!ఎక్క!!


యెటువలెఁ బొద్దు వేగు నినకులేశ్వరునకు
నీటున నన్నుఁ బాసిన నాటి నుండి
కట కట తన్నుఁ బాసి కంటినె నిన్నియును
యిటువలె దైవమాయ యింత నన్నుఁ జేసెఁగా !! ఎక్క!!

వుంగరము పుత్తెంచెను వున్నదిగా కృప నాపై
కంగిన పగెల్లా నీఁగి కైకొనె నన్నును
కంగుగ శ్రీనేంకటాద్రి రఘుపతి నన్నుఁ గూడె
యింగితాన నయోధ్య యేలెఁగా యిప్పుడు. !! ఎక్క!!


అన్నమయ్యకు శ్రీ వేంకటేశునికి రఘుపతికి అభేదమే!
నాకు అర్ధం తెలియని పదాలు:
కంగిన
కంగుగ