శ్రీరాగం
పతిఁ గలసి మేనెల్ల పరవశంబగుకంటె
హితవిరహమున నెదిరి నెఱుఁగుటే మేలు IIపల్లనిII
పరపీడ గానించి బతుకు బతుకుటకంటె
పరహితము చేయునాపదలె మేలుహితవిరహమున నెదిరి నెఱుఁగుటే మేలు IIపల్లనిII
పరపీడ గానించి బతుకు బతుకుటకంటె
సిరుల నడిమికి భయము సేయు చనుఁగవకంటె
తరుణి నీ నెన్నడిమి దైన్యమే మేలు IIపతిII
కాంత నితరులకింద గరువించుకంటె మతిఁ
జింతఁ గందుచు నలయు సిలుగె మేలు
కుంతలంబుల కిందఁ గులుకుఁ జూపులకంటె
చెంతలను నీ తురుము చెదరుటే మేలు IIపతిII
తొడరి సరివారి వొత్తుడుకు నోర్చుటకంటె
గొడవతో వాఁడి గై కొనుటె మేలు
పడఁతి నీ వేంకటప్పనిరతి నలయుకంటె
కెడపి కొనగోళ్ళ సోఁకించుటే మేలు IIపతిII
అర్ధం కాని పదములు:
హితవిరహమున
గరువించుకంటె
సిలుగె
వాఁడి గై కొనుట
కెడపి
ఈ కీర్తనలో అన్నమయ్య కొన్ని కొన్నిటికి పోలికలు చెబుతూ
ఒకదాని కంటె ఒకటి ఏవిధంగా మేలో చెబుతున్నాడు.
ఇందులో నాకు తెలియని పదాలకర్ధాలు ఎవరైనా తెలియపర్చగలరని ఆశిస్తున్నాను.
5 comments:
మంచి కీర్తనను పరిచయం చేసారు.
బాగుంది. పదాలకర్ధం చెప్పే సామర్ధ్యం కానీ, సాహసం కానీ నాకు లేవు. రానారె గారు చెప్పగలరేమో.
బొల్లోజు బాబా
నరసింహ గారు..
౧. అభినందన : మంచి బ్లాగు మొదలు పెట్టారు. మీ బ్లాగు బావుంది. మంచి ఆలోచన.
౨. అనుమానం : మీకు రెండు బ్లాగులు ఉన్నాయి. రెండింటి పేరూ 'నరసింహ' కదా. రెండూ ఒకే లాంటి బ్లాగులు కదా. రెండూ ఒకటే చెయ్యొచ్చు కదా. ఒక వేళ మీకు రెండు బ్లాగులు నిర్వహించాలని అనిపిస్తే వేరే వేరే పేర్లు పెట్ట వచ్చు కదా. దీనికి ఏమైనా కారణం ఉందా ?
నరసింహ గారికి
సుజాత గారు చెప్పిన విషయం నేను కూడా గమనించాను. రెండు బ్లాగులు ఉండటం వలన సందర్శకులకు ఇబ్బంది కలుగుతుంది. విహారి గారు మీ బ్లాగు ను చూసి అక్కడ పోష్టు లేక పోవటం వలన ఇందులో విషయమేది అని కామెంటు చేసి వెలిపోయారు. గమనించారా?
బ్లాగుల పేర్లైనా మార్చండి లేదా మొత్తం పోష్టులన్నింటిని ఒక బ్లాగులోకి తీసుకువచ్చేసి, రెండవదాన్ని డిలిట్ చేయ్యండి.
ఆలోచించండి
బొల్లోజు బాబా
సుజాత గారికి బాబా గారికి నెనరులు.నాకు కంప్యూటరు పరిచయం తక్కువ.మొన్న మొన్ననే బ్లాగటం మొదలు పెట్టాను.బ్లాగు ప్రారంభించే ప్రయత్నంలో అనుకోకుండా ఒకేసారి రెండు బ్లాగులు మొదలయ్యాయి.ఇదేదో బోనస్ లా బానే వుందని అలానే వుంచేసాను.రెండు బ్లాగులనీ కలిపే ఆలోచనలోనే ఉన్నాను.మీ అభినందనలకు నా నెనరులు.
మంచి మంచి కీర్తనలు పరిచయం చేస్తున్నారు. అందుకు ధన్యవాదములు.
హితవిరహం అంటే - అప్పుడప్పుడు పతి కి దూరంగా వుండి విరహగ్నిన దహించబడుటే మేలు అన్న తాత్పర్యాన్ని ఒక్క పదం తోనే చెప్పారు.
గరువించుకంటే - సౌఖ్యమున లోలనాడుట కంటే (ఈ పదానికి ఖచ్ఛితమైన అర్ధం తెలియదు. శోధించి చెప్పగలనేమోనని ప్రయత్నిస్తాను.)
వాఁడి గై కొనుట - దీనికి చాల పర్యాయ పదాలున్నాయి. కాని ఈ వాక్యంలో "అటో ఇటో తేల్చుకోనుట" అన్న అర్ధం గోచరిస్తోంది.
మిగత పదాలకి ఖచ్ఛితమైన అర్దం తెలీదు.
Post a Comment