బౌళి
ఓరుపు గలవారికి వోరుచుకుంటేనే మేలు
యేరితేను మలిగండ్లు యెందులోను లేవే. IIపల్లవిII
నా రమణునిపైఁ జాడి నాతోనేమి చెప్పేరే
తేరకొని నాచే నేల తిట్టించేరే
గోరుమేననుండదంటా గురుతులేమి చూపేరే
తారి బియ్యము దంచితే తవుడు వెళ్ళకుండునా. IIఓరుII
భావమిద్దరికొక్కటే పగలేల పుట్టించేరే
ఆవేళ నాచే వెంగెములాడించనేలే
మోవనాడె (డియ?)తనిమర్మములేల తలఁపించేరే
భావించ రత్నాకరానఁ బచ్చిగుల్లలుండవా. IIఓరుII
గక్కన శ్రీవేంకటేశుఁ గడునేల నవ్వించేరే
వొక్కటైతేఁ జన్నులచేనొత్తించేరేలే
పెక్కురతులలోననేల పిరివీకు సేయించేరే
గక్కన నీళ్ళ నీడ గానరాక మానునా. IIఓరుII ౭-౧౯౪
Friday, August 1, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment