భైరవి
అమ్మమ్మ యేమమ్మ అలమేల్మంగ నాచారమ్మా
తమ్మి యింట నలరుకొమ్మా వోయమ్మా। ॥ పల్లవి॥
నీరిలోనాఁ దల్లడించి నీకే తలవంచి (మత్స్యావతారం)
నీరికిందాఁ బులకించి నీ రమణుండు (కూర్మావతారం)
గోరికొనఁ జెమరించిం గోపమేపచరించి (వరాహావతారం)
సారెకు నీ యలకిట్టె చాలించవమ్మా। ॥అమ్మమ్మ॥
నీకుఁగానె చెయిజాఁచి నిండాఁ గోపమురేఁచి (వామన,పరశురామావతారములు)
మేకొని నీవిరహాన మేను వెంచేని (రామావతారం)
యీకడాకడి సతుల హృదయమే పెరరేఁచీ (కృష్ణావతారం)
నాకు మడిచియ్యనైనా నానతియ్యవమ్మా। ॥అమ్మమ్మ॥
చక్కఁదనములె పెంచి నకలముఁగాలదంచి
నిక్కపు వేంకటేశుండు నీకె పొంచీని
మక్కువతో నలమేల్ మంగనాచారమ్మా నీ
యక్కున నాతని నిట్టె అలరించవమ్మా। ॥అమ్మమ్మ॥ ౬-౬౪
Saturday, July 19, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment