Monday, July 7, 2008

కలసి కాకలఁ బెట్ట కను సన్నలనె తిట్ట

ముఖారి-ఏకతాళి
కలసి కాఁ కలఁ బెట్ట కను సన్నలనె తిట్ట

చలపట్ట నీకుఁ జెల్లే జాణఁ డే యతఁ డు IIపల్లవిII

పగటుగుబ్బలురాయ పసిఁ డి మట్టెల మ్రోయ
నగవు వెన్నెల గాయ నడచేవు
పగ నిన్ను భ్రమయించ వలపువారిధి ముంచ
జగడాలు వచరించ చతురుఁ డే యతఁ డు। IIకలసిII

చూపులనె పగచాట సొబగులఁ గనుగీఁ టఁ
దీపుల పై పై మీఁ ద దిరిగేవు
కోపగింతలనేఁ ప కూరిములు పైఁ జాఁ ప
రాపులు పెర రేఁ ప రసికుఁ డే యతడు IIకలసిII

సందుల దండలు జార జవ్వాదిచెమట గార
నందములు దై వార నలసేవు
కందువుల నినుఁ గూడి కరఁ గి సిగ్గులు వీడి
విందై నీ తోడుతనాడే వేంకటేశుఁ డితడు।IIకలసిII -२०२

3 comments:

Bolloju Baba said...

చాలా బాగుంది
బొల్లోజు బాబా

Unknown said...

బాబా గారూ నెనరులు.

Anonymous said...

Nice post and this post helped me alot in my college assignement. Say thank you you for your information.