లలిత
కొసరి నీతోఁ బెనఁ గి మోక్ష మడుగ
వెస నీ బంట నింతే నీవే దిక్కు నాకు IIపల్లవిII
బలిమి నీ బిడ్డఁ డైన బ్రహ్మంతవాఁ డనా
అల సముద్రుఁ డు మామ యంత వాఁ డనా
చలువైన నీ మఱఁ ది చంద్రునంతవాఁ డనా
యెలమి నీతోఁ బుట్టిన యింద్రునంతవాఁ డనా . IIకొసరిII
చనువున మీ తండ్రి కశ్యపునంతవాఁ డనా
అనుజుఁ డైన లక్ష్మణునంతవాఁ డనా
మనవికి మీ బావ ధర్మజునంతవాఁ డనా
అనుఁగుఁ దాతయైన భీష్మునంతవాఁ డనా . IIకొసరిII
మనికైన యల్లుఁ డభిమన్యునంతవాఁ డనా
అనిరుద్ధుఁ డు మనుమఁ డంతవాఁ డనా
ఘనుఁ డశ్రీవేంకటేశ కల్పించి నీ వాడించఁ గా
పనిపూని మెలగేటి ప్రతిమను నేను।IIకొసరిII 15-432
Saturday, July 5, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment