Tuesday, July 7, 2009

తార వలచినయపుడె తరుణిరతుల

సామంతం
తార వలచినయపుడె తరుణిరతుల
తారసము లెట్లుండు తగవు లెట్లుండు. IIపల్లవిII


తరితీపు లెట్లుండు తాలుము లెట్లుండు

గరువంబు లెట్లుండు కసరు లెట్లుండు

పొరపొచ్చె మెట్లుండు పొలయలుక లెట్లుండు

నెరవరిక లెట్లుండు నెఱుక లెట్లుండు. IIతారII


ఓపికలు నెట్లుండు నొల్లములు నెట్లుండు

చూపోప మెట్లుండు సొలపు లెట్లుండు

దాఁపరము లెట్లుండు తగుమాన మెట్లుండు

కోపంబు లెట్లుండు కొఱఁత లెట్లుండు. IIతారII


సిరిదొలఁకు లెట్లుండు శేషాద్రిపతి కరుణ

కిరవైన సతిమనసు నెపుడు నెట్లుండు

మురిపమది యెట్లుండు ముద్దుఁజనుఁగవమీఁద

నరచందురుని రేక లపుడెట్టులుండు. IIతారII
6-27


తార=తానే
తారసము=తలపాటు

తరితీపు=ఉపేక్ష

తాలిమి=క్షమ, ధైర్యము

కసరులు=కోపములు

పొరపొచ్చెము=భేదము

పొలయలుకలు=ప్రణయకోపములు

నెరవరికలు=

ఎఱుకలు=గుఱుతులు

ఒల్లమి=వలవమి(వలచునకు వ్యతిరేకార్థము)

చూపోపమి=చూపు+ఓపమి=చూపును భరించలేకపోవుట

సొలపులు=
పారవశ్యములు
దాఁపరము=
ప్రాప్తి
మానము =చిత్తౌన్నత్యము

కొఱఁతలు=
సిరిదొలఁకులు=

No comments: