Tuesday, June 9, 2009

చూడరమ్మ యిటువంటి సుదతులు లేరెందు

రామక్రియ
చూడరమ్మ యిటువంటి సుదతులు లేరెందు
యేడనైన నిటువంటి యింతులు వుట్టుదురా. IIపల్లవిII

ముదితనడపులలోని మురిపమే వెయిసేసు
కొదమ గుబ్బలతీరు కోటివేలు సేసు
సుదతి బిత్తరిచూపు సొన్నాటంకాలే సేసు
అదరబింబముతీరు ఆరువేలు సేసు. IIచూడII

సన్నపు నడుము లోని సైకమే లక్ష సేసు
పన్నుగాఁ బిరుఁదువన్నె పదివేలు సేసు
యెన్నిక మెఱుఁగుఁదొడలెంతధనమైనఁ జేసు
నున్నగా దువ్వినకొప్పు నూరువేలు సేసు. IIచూడII

అంగన భాగ్యమెట్టిదో అతిమోహమై తిరు-
వెంగళరాయనికృప వేవేలు సేసునే
బంగారుచవికెలోఁ బడఁతిఁ గూడిన సొంపు
రంగుగాఁ జెలియరూపు రాజ్యమెల్లఁ జేసునే. IIచూడII 5-304

2 comments:

nagaraju rudroju said...

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ సుక్తి గురించి నా ఆబిప్రయము.
నాకు తేలిసినంతవరకు ధర్మం ఆంటె మనం వుంటున్న భుమి, భుమి వుంటున్న సౌరమండలం, సౌరమండలం వుంటున్న పాలపుంత, ఇలా భ్రమాండాన్నే నిలిపీ వుంచగలిగే శక్తి ధర్మం. ధర్మో రక్షతి రక్షితః ఆంటె భ్రమాండని నిలిపీ వుంచి మనకు నివసించడనికి ప్రసాదించిన ప్రక్రుతిని రక్సిత్తె ఆది మనన్లి రక్సిస్తుది అని నా అబిప్రయం.

Unknown said...

ప్రతిస్పందించినందులకు మీకు నా ధన్యవాదాలు.
దయచేసి పోస్టు చేసే ముందొకసారి మనం వ్రాసివ విషయాన్నోసారి తిరిగి పరిశీలించు కోవటం మంచిది. అలాచేయటం వలన టైపాటులను సవరించుకొనే అవకాశం మనకు ఉంటుంది.