Saturday, June 6, 2009

అంత సేయకుండితే నే నాఁటదాననా

పాడి
అంత సేయకుండితే నే నాఁటదాననా
పంతపు నీ బిగువెల్ల బయట వేయింతునా. IIపల్లవిII

కూరిమి సతుల భీతి గోర నన్ను నంటనీక
సారెకుఁ దప్పించు కొంటా సాము సేసేవు
యేరా నీకు నింత వెరపిటువంటి నిన్ను నే పో
జీరలు మేనెల్లఁ జేసి సిగ్గు విడిపింతునా. IIఅంతII

మొక్కుచుఁ గెమ్మోవి మీఁద మోపనియ్యవేర పల్లు
వెక్కసపు తమకాన విఱ్ఱవీఁ గేవు
చిక్కితి వెక్కడికి విచ్చేసేవు నిన్ను నే
దక్కగొని మదన విద్యలనే చొక్కింతునా. IIఅంతII

ఎక్కువ నామేని జవ్వాదిందరుఁ దెలిసేరంటా
మిక్కిలి నీ మేనితావి మెరయించేవు
చక్కని వేంకటగిరి స్వామి నన్నుఁ గూడితివి
గక్కన నాచూపు నీకుఁ గావలి వెట్టింతువా. IIఅంతII 5-81

No comments: