Friday, May 29, 2009

విరహమొ సంభోగంబుల వేడుక శృంగారమొ యిది

శ్రీరాగం
విరహమొ సంభోగంబుల వేడుక శృంగారమొ యిది
సరసిజముఖిఁగని ప్రాణము జల్లనఁ గలఁగెడినే. IIపల్లవిII

కుటిలాలకి మైఁబూసిన కుంకుమగంధపు రసములు
చిటిపొటి చెమటలఁ బెనఁగొని చిప్పిలి రాలఁగను
విటరాయని యలరమ్ములు వీఁపున వెడలఁగ నాఁటిన
తొట తొటఁ దొరిగిన నెత్తురుతోఁ దులదూఁగెడినే. IIవిరహII

మృగలోచన చనుఁగవపై మెత్తిన కమ్మని తావుల
మృగమదమంటినచోట్లు మెఱుఁగులు వారెడిని
చిగురాకున మరుఁడేసిన చిచ్చరబాణంబులచే
ఎగసిన పొగలై తోఁచీ నేమని చెప్పుదునే. IIవిరహII

యోగవియోగంబులచే నొనగూడిన యీ చెలియకు
నాగరికంబుల చేఁతలు నటనలు మీరఁగను
శ్రీగురుఁడై చెలువొందిన శ్రీ వేంకటగిరి నిలయుని
భోగించిన పరిణామపు పొందులు దెలిపెడినే. IIవిరహII 5-79

కుటిలాలకి - ఈ పదం అంటే నాకెంతో ఇష్టం కాని, అర్థం తెలీదు. ఎవరైనా పెద్దలు తెలియపరిస్తే కృతజ్ఞుడనై వుంటాను.

No comments: