Sunday, April 26, 2009

ఎట్టు నమ్మ వచ్చు రా యిటువంటి నీవు

శుద్ధవసంతం
ఎట్టు నమ్మ వచ్చు రా యిటువంటి నీవు
వట్టి మాయలఁ బెట్టేవు వద్దు వద్దు తలరా.

మంచివాని వలెనె నా మాటలు వెలుచుకొని
యెంచి చూచి నీలోనె యేల నవ్వేవు
చుంచుల నా చుట్టమవో సూడుబంటవో నీవు
అంచల నన్నియు నాయ నప్పటి నంటకురా.

వలచినవానివలె వద్దికి రప్పించుకొని
తలఁపు చేకొని జాణతనా లాడేవు
యిల నీ గుణ మిదెయోయింతయు నా భాగ్యమో
కలపుకో లిఁక నేల కంటి నురకుండరా.

బత్తి గలవానివలె పట్టి యాకు మడి చిచ్చి
యిత్తల మదన మెత్తించి యెమ్మె చూపేవు
హత్తిన శ్రీవెంకటేశ అట్టె ఫలమో చలమో
చిత్తగించి కూడితివి సిగ్గు లిఁక నేలరా.౧౧-౨౨౮

1 comment:

Anonymous said...

hai ru telugu i see ur site more visiting ursite new members y u dont use ad net work contactat me anil202008@rediffmail.com goodnetwork is here dont use small networks dont wast time ok