Saturday, April 18, 2009

సాళంగం
సడి సన్న యట్టి నెరజాణ నందువు
గొడవలు దీరఁ జెలిఁ గూడ రాదా రతుల. IIపల్లవిII

చిగురుఁబానుపుమీఁదఁ జెలి విరహానఁ
చిగురువంటిచేయి చెక్కునఁ బెట్టి
చిగురులోపలి చేగ చిత్తమునఁ బుట్టదాయ
చిగురుఁ బోణిని దయ సేయ రాదా విభుఁడ. IIసడి సన్నII

పూవులతోఁటలోన పొలఁతి తాపాన నుండి
పూవుల మొగ్గలు మేనఁ బులకించెను
పూవులలో పూఁపలు పుట్ట వాయ మాటలలో
పూవుఁబోణి నీవు గొంత బుజ్జగించ రాదా. IIసడి సన్నII

పండువెన్నెలబయట భామిని యలయుచునుండి
పండువంటిమోవివాఁడు బయట వేసె
పండుగలు గాఁగ నిట్టె బాపురె శ్రీవేంకటేశ
పండుజవ్వని గూడితి పవ్వళించ రాదా. IIసడి సన్నII11-౩౭౨

No comments: