Thursday, April 16, 2009

అటువంటి నిన్నేమందు ఆపె నేమందు

సాళంగనాట
అటువంటి నిన్నేమందు ఆపె నేమందు
తటుకున మీసిగ్గులు తడవ నేమున్నది. IIపల్లవిII

శ్రీసతి కాఁగిటనుండి జిడ్డుగొల్లెతలనెల్ల
బాసలిచ్చి కాఁగిలించి పాలించితి
మోసపుచ్చి అందులోన మొఱఁగఁగఁ జోటులేదు
యీసరియాఁడువారిలో నింతబండు గలదా. IIఅటుII

భూమిదేవిని వీఁపున పూఁచి మోచి అచ్చరల
దోమటిఁ బదారువేల దొమ్మిఁ గూడితి
బూమెలు సేసి నీ కంతబొంక నిందు యెడలేదు
భామినులపొందికలు పచ్చి సేయఁదగునా. IIఅటుII

శిరసు పై తులసిని చెక్కుక మరెందరైన
తరుణులఁ గూడితి నన్నుఁ దగఁ గూడితి
యిర వెఱిఁగుండఁగానే యింత భ్రమయించరాదు
నిరతి శ్రీవేంకటేశ నీకే తెలుసును. IIఅటుII ౨౦-౩౧౯

చెలికత్తెలు శ్రీహరి దక్షిణనాయకత్వం గురించి చెప్తూ శ్రీదేవిని, భూమిదేవిని(కొత్త ప్రయోగం), తులసిని మెచ్చుకోవటం ఇందులో అందంగా చెప్పబడింది.

No comments: