Tuesday, April 14, 2009

తనిసితి మిఁక మముఁ దడవకురా

శంకరాభరణం
తనిసితి మిఁక మముఁ దడవకురా
చనవుకు మనవికి సరికిసరి. IIపల్లవిII

నలుగడ నీవిటు నవ్విననవ్వులు
అలిగిన వేళకు నవి సరియే
వలపులు చల్లేవు వాదుకు వచ్చేవు
చలువకు వేఁడికి సరికిసరి. IIతనిII

వరుస నాకిచ్చితి వద్దికి వచ్చిన
సరవులఁ బెట్టిన సరికిసరి
మరిగినాఁ బోనీవు మాటలు నాడవు
సరసము విరసము సరికిసరి. IIతనిII

తమకంబున మనతనువు లిద్దరికి
సమరతి వుపరతి సరికిసరి
అమరిన శ్రీవేంకటాధిప యిటు మన-
సముకపుమఱపులు సరికిసరి. IIతనిII ౨౦-౨౩౪

No comments: