Thursday, April 2, 2009

విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా

రామక్రియ
విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా
మచ్చిక మరునిఢాక మగువనీరాక. IIపల్లవిII



పంచలపసిండినిగ్గు వచ్చిదేరే సిగ్గు

వంచనవలపుతీపు వాలుకచూపు

కంచపుంబాలకూడు కాఁకలనీవాడు

మంచపునీతలబ్రాలు మట్టెలపాదాలు. IIవిచ్చేII



కోవిలకొసరుఁబాట కొమ్మరో నీమాట

తావులచెంగావి నీతళుకుమోవి

గోవజవ్వాది కరంగు గుబ్బల నీమెఱుంగు

భవజుదాడిరొదలు పాదపునీకదలు. IIవిచ్చేII



ముద్దుల నీనగవు చిమ్ములరతిబిగువు

అద్దలింపుఁగసరు మోహంపుఁగొసరు

గద్దరినీయలపు వెంటపతితలఁపు

అద్దపునీమోము మోహనరతిసాము. IIవిచ్చేII ౬-౧౦౪

No comments: