Sunday, March 29, 2009

మనసునఁ బొడమిన కోపము మనసునకంటెను ఘనమఁట

సామంతం
మనసునఁ బొడమిన కోపము మనసునకంటెను ఘనమఁట
మనసిదుఁడుద్బోధకుఁడఁట మాటల పనియేల. IIపల్లవిII

దవ్వుల కొండల పవనుఁడు తనుతాప ప్రేరకుఁడట
నవ్వులఁ బుట్టిన చూపులు నాటెడియమ్ములఁటా
పువ్వులు సోఁకిన యంతనే పొక్కెడునఁట దేహంబులు
యెవ్వఁడెఱుంగును ఈవిధమేమని చెప్పుదమూ. IIమనII

చక్తఁదనములఁట గుండెలు జల్లనం జేయఁగలవఁట
మక్కువలఁట దేహంబులు మరవఁగ జేయునఁటా
కిక్కిఱిసిన తమకంబులు క్రిందును మీఁదు నెఱుఁగవఁట
ఱెక్కల పులుగుల పలుకులు ఱేఁపెడువుండ్లటా. IIమనII

సంతసములుఁ జతురతలును సౌభాగ్యవిలాసములును
మంతనములు మోహంబులు మందులసంచులటా
యింతటికిని తగుమూలం బీవేంకటవిభుఁడట
యింతితలంపునఁ గలుగుట లిఁక నెన్నఁగనేలా. IIమనII -౪౪

No comments: