Friday, February 27, 2009

అన్నిటా దొరవయితే నౌదువుగాని

దేసాళం
అన్నిటా దొరవయితే నౌదువుగాని
విన్నవించితి నిప్పుడే వెలఁది చందములు. IIపల్లవిII

సిగ్గరిపెండ్లికూఁతురు సేసవెట్టీ నిదె నీకు
వొగ్గి తలవంచవయ్యా వొద్దికతోను
కగ్గులేక యప్పటి నీకాలు దొక్కీ వేడుకతో
యెగ్గులు వట్టేవుసుమ్మీ యిందుకుగాను. IIఅన్నిII

కలికి నీ మరఁదలు కంకణము గట్టీ నీకు
లలిఁ జేయి చాఁచవయ్యా లాలనతోను
యెలయించి సన్నలనే యెంగిలిమోవి చూపీని
మలసి దూరేవుసుమ్మీ మన్నింతువు గాని. IIఅన్నిII

దేవు లలిమేలుమంగ తెరదీసి చెనకీని
సేవ సేయించుకోవయ్యా శ్రీవేంకటేశ
వోవరిలోనికి దీసి వురమెక్కీ నింతలోనె
యేవేళా దించేవుసుమ్మీ యిట్టె వుందువుగాని. IIఅన్నిII29-౧౭౫

No comments: