Thursday, February 26, 2009

చిన్నదాననంటా నీవు సిగ్గువడేవే

ముఖారి
చిన్నదాననంటా నీవు సిగ్గువడేవే
చన్నుల నొరసి మోవి చవిచూపఁగదవే. IIపల్లవిII

చేరి చూడఁగఁజూడఁగా చీఁకటి వెలుగందురు
పేరఁబెట్టితే పాలే పెరుగందురు
కోరి కాచుకుండితే చిగురులే చేగలందురు
వోరుపుతో నాతని వూడిగాలే సేయవే. IIచిన్నII

మరుఁగగా మరుఁగగా మచ్చికవుట్టు నందురు
పెరిగితే పూఁపలే పిందె లందురు
నెరులు గూడఁగా నిండుఁగొప్పాయ నందురు
సరసము లాతనితో సారెసారె నాడవే. IIచిన్నII

మఱి చెప్పఁగాఁజెప్పఁగా మాఁటలే కత లందురు
తఱచు పొందుసేసితే తగు లందురి
చిఱునవ్వులతో నిన్ను శ్రీవేంకటేశుఁడు గూడె
మెఱసి పెక్కురతుల మెప్పించవే. IIచిన్నII ౨౯-౧౪౦

No comments: