Thursday, February 19, 2009

ఊరకున్న వానిమీఁద నుడుకులు గట్టేమా

సామంతం
ఊరకున్న వానిమీఁద నుడుకులు గట్టేమా
దారతప్పక తనంత తానుండరాదా. IIపల్లవిII

చేయెత్తి మొక్కేటివాఁడు చేరి వేడుకొనేవాఁడు
సేయరాని పనులెల్లాఁ జేయనేఁటికే
ఆయాలు ముట్టేటివాఁడు ఆనలు వెట్టేటివాఁడు
పాయపు సతులతోను పందేలాడనేఁటికే. IIఊరII

అలుకలు దిద్దేవాఁడు ఆసలఁ బెట్టేవాఁడు
చెలుము లెక్కడనైనా సేయనేఁటికే
పిలువ వచ్చేటివాఁడు ప్రియాలు చెప్పేటివాఁడు
చలివాసి గొల్లెతల చన్నులంట నేఁటికే. IIఊరII

కప్పుర మిచ్చేటివాఁడు కాఁగిటఁ గూడేటివాఁడు
చొప్పులఁ బరకాంతలఁ జూడనేఁటికే
ఇప్పుడు శ్రీవేంకటేశుఁ డింత నన్నేలినవాఁడు
కుప్పలుగా నింతులను కూడపెట్టనేఁటికే. IIఊరII౧౪-౭౭




No comments: