Saturday, February 14, 2009

వలపువో కారణము వైభవంబులకుఁ దమ

సామంతం
వలపువో కారణము వైభవంబులకుఁ దమ
తలఁపువో సకలంబుఁ దగులు సేసినది. IIపల్లవిII

చూపువో ప్రియములకుఁ జోటునేసినది తరి
తీపువో వెడయాస దీరనీయనిది
రూపువో సౌఖ్యంబు రుచిసేసినది పువ్వుఁ
దూపువో హృదయంబు దూరిపాఱినది. IIవలII

ఒఱపువో పెడఁబాసి వుండనియ్యనిది తమ
వెఱపువో దేహంబు వెచ్చఁజేసినది
మఱపువో ధైర్యంబు మానిపించినది కను
గిఱుపువో సిగ్గెల్లఁ గ్రిందుపఱిచినది. IIవలII

చెలిమువో కారణము శ్రీవేంకటేశుకృప
కలిమివో మచ్చికలు కలుగఁజేసినది
ఎలమివో యీపొందు లితవు సేసినది మరు
బలిమివో కోరికలఁ బట్టి తెచ్చినది. IIవలII౬-౧౫౯

No comments: