రామక్రియ
ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము
వేమరు నోపుణ్యులాల వినరో యీకతలు. IIఏమనిII
అనంత సూర్యతేజుఁడట కాంతి చెప్పనెంత
దనుజాంతకుఁడట ప్రతాప మెంత
మనసిజగురుఁడట మరిచక్కఁదనమెంత
వనజుఁగనినట్టివాఁడట ఘన తెంత. IIఏమనిII
గంగాజనకుఁడట కడుఁ జెప్పేపుణ్య మెంత
చెంగట భూకాంతుఁడట సింగార మెంత
రంగగు లక్ష్మీశుఁడట రాజసము లెంచ నెంత
అంగవించు సర్వేశుఁడట సంప దెంత. IIఏమనిII
మాయా నాథుఁడట మహిమ వచించు టెంత
యేయెడఁ దా విష్ణుఁడట యిర వెంత
పాయక శ్రీవేంకటాద్రిపతియై వరములిచ్చే
వేయిరూపులవాఁడట విస్తార మెంత. IIఏమనిII౪-౪౮౨
Wednesday, February 11, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment