Sunday, February 8, 2009

ఇందరిగాచిన నీవు యిట్టే నీవు నాకు

సామంతం
ఇందరిగాచిన నీవు యిట్టే నీవు నాకు
కందువ నిధానమై కలవుగా నీవు. IIపల్లవిII

అరసి ధ్రువుని గాచినట్టి నీవు
కరుణతోఁ బ్రహ్లాదుఁ గాచిన నీవు
కరిరాజు శరణంటేఁ గాచిన నీవు
కరతలామకమై కలవుగా నీవు. IIఇందరిII

గట్టిగా విభీషణుఁగాచిన నీవు
అట్టె ద్రౌపదిఁ గాచినప్పటి నీవు
చెట్టవట్టి బలిఁగాచిన నీవు నాకు
కట్టిన ముడుపవై కలవుగా నీవు. IIఇందరిII

కమ్మర సుగ్రీవునిఁ గాచిన నీవు నేఁడు
కిమ్ముల లోకములు రక్షించే నీవు
నెమ్మది శ్రీవేంకటనిలయ నీవు మాకు
కమ్ముకొని దాపుదండై కలవుగా నీవు. IIఇందరిII౪-౩౫౦

No comments: