గుండక3ియ
కడుపెంత తాఁ గుడుచుకుడుపెంత దీనికై
పడనిపాట్ల నెల్లఁ బడి పొరలనేలా. IIపల్లవిII
పరులమనసునకు నాపదలు గలుగఁగఁజేయ
బరితాపకరమైన బ్రదుకేలా
సొరిది నితరుల మేలు చూసి సైఁపఁగలేక
తిరుగుచుండేటికష్టదేహ మిది యేలా. IIకడుII
యెదిరి కెప్పుడుఁ చేయు హితమెల్లఁ దనదనుచు
చదివిచెప్పనియట్టిచదువేలా
పొదిగొన్న యాసలోఁ బుంగుడై సతతంబు
సదమదంబై పడయుచెవులు దనకేలా. IIకడుII
శ్రీవేంకటేశ్వరునిసేవారతికిఁగాక
జీవనభ్రాంతిఁబడుసిరులేలా
దేవోత్తముని నాత్మఁ దెలియనొల్లక పెక్కు-
త్రోవ లేఁగినదేహిదొరతనంబేలా. IIకడుII౧-౩౦౨
Monday, February 2, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment