బౌళి
చిన్నదానవు గనక చెప్పితి నీకీ బుద్దులు
పన్నుక నీపొందులివి పాయకిట్టె సేయవే. IIపల్లవిఈఈ
తప్పక చూచితేనే తగులాయములు వుట్టు
చిప్పిలఁగ నవ్వితేనే చిత్తములంటు
చొప్పుఁగా మాటలాడితే చుట్టరికములు రేఁగు
యెప్పుడూను పతిపొందు లేమరక సే.వే. IIచిన్నఈఈ
కొలువులు సేసితేను కోరికలు కొనసాగు
వెలినుండి వేఁడుకొంటే వేడుకగల్గు
తలకొని చెనకితే తమకము లుప్పతిలు
మలసి నీపతిపొందు మఱవక సేయవే. IIచిన్నII
వావులు దలపెట్టితే వాడికలు సమకూడు
మోవితేనె చూపితేను మోహము మెండు
యీవేళ నిన్నుఁగూడె ఇదియే యలవాటౌను
శ్రీవేంకటేశ్వరుపొందు సేనలుగాఁ జేయవే. IIచిన్నII ౨౮-౪౫౧
Sunday, February 1, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment