Wednesday, January 7, 2009

ఏలేయేలే మరఁదలా చాలుఁజాలు చాలును

Get this widget | Track details | eSnips Social DNA

పాడి
ఏలేయేలే మరఁదలా చాలుఁజాలు చాలును
చాలు నీతోడి సరసంబు బావ. IIపల్లవిII

గాఁటపు గుబ్బలు గదలఁగఁ గులికేవు
మాటలఁ దేటల మరఁదలా
చీటికి మాటికిఁ జెనకేవే వట్టి-
బూటకాలు మాని పోవే బావ. IIఏలేII

అందిందె నన్ను నదలించి వేసేవు
మందమేలపు మరఁదలా
సందుకోఁ దిరిగేవు సటకారి వోబావ
పొందు గాదిఁకఁ బోవే బావ. IIఏలేII

చొక్కపు గిలిగింత చూపుల నన్ను
మక్కువ సేసిన మరఁదలా
గక్కున నను వేంకటపతి కూడితి
దక్కించుకొంటివి తగులైతి బావ. IIఏలేII౫-౧౬౩

No comments: