Thursday, January 8, 2009

నెలఁతకుఁ గొండలతిమ్మని నేనిదె తోడ్కొనివచ్చెద

నాదరామక్రియ
నెలఁతకుఁ గొండలతిమ్మని నేనిదె తోడ్కొనివచ్చెద
ఎలనాగలు మీరిందరు నేమరకుఁడి చెలిని. IIపల్లవిII

వలపుల రేనికి చెంగలువల కొండము చొర మొక్కుఁడి
అలులకు పూఁదేనియ సోయగములు మెయికొనుఁడి
ఫలరసములు మీఁదెత్తుఁడి పదరి చిలుకలకును గోవిలలకు
పొలఁతికి కెందమ్మిరేకులు పోయుఁడు బడిమిగను. IIనెలతII

కట్టుఁడి సన్నపువలిపెము కర్పూరముఁ బన్నీరును
దట్టముగాఁ బైనలఁదుఁడి తరుణీమణికి
ఒట్టుఁడి జాజులు పరపున నొరపెరిఁగిన చెలికత్తెలఁ
బెట్టుఁడి మరుబలములచే బెగ్గిలి పడకుండ. IIనెలతII

చిగురునఁ గెంపులు మొలచెను చిత్రము చూడఁగదమ్మా
మొగుడలపై నల చంద్రుని మూఁకలు మరిగినవి
మొగమున బిత్తరిచేఁతలు మును లేవివి చెలికబ్బెను
మగువయు(కు?) తిరువేంకటపతి మమతల పరిణతలు.IIనెలతII ౫-౩౫౨

No comments: