Monday, January 5, 2009

గందము పూసేవేలే కమ్మని మేన యీ-

Get this widget | Track details | eSnips Social DNA

భైరవి
గందము పూసేవేలే కమ్మని మేన యీ-
గందము నీమేనితావికంటె నెక్కు డా. IIపల్లవిII

అద్దము చూచేవేలే అప్పటప్పటికిని
అద్దము నీ మోముకంటె నపురూపమా
ఒద్దిక తామరవిరినొత్తేవు కన్నులు నీ-
గద్దరికన్నులకంటె కమలము ఘనమా. IIగందముII

బంగారు వెట్టేవేలే పడతి నీ మెయినిండా
బంగారు నీతనుకాంతి ప్రతివచ్చీనా
ఉంగరాలేఁటికినే వొడికపువేళ్ళ
వెంగలి మణులు నీ వేలిగోరఁ బోలునా. IIగందముII

సవర మేఁటికినే జడియు నీ నెరులకు
సవరము నీకొప్పుసరి వచ్చీనా
యివలఁ జవులు నీకునేలే వెంకటపతి-
సవరని కెమ్మోవిచవికంటేనా. IIగందముII ౫-౨


చెలులు అలమేలుమంగతో--
నీ కమ్మని వొంటికి గంధము రాసేవెందుకే? నీ శరీరానికున్న సహజగంధము కంటే ఈ గంధపు వాసన యెక్కువ సువాసన నియ్యదే!
అప్పుడప్పుడూ అద్దము చూచుకుంటున్నా వెందుకే? ఆ అద్దమేమీ నీ ముఖానికంటే అపురూపమైనదేం కాదే!
అలా జాగర్తగా తామరపువ్వులతో కన్నులనొత్తుకుంటున్నా వెందుకే? నీ దిట్టతనపు కనులకంటే ఆ కమలము ఘనమైనదేం కాదే!

నీ శరీరం నిండా అలా బంగారాన్ని దిగేశావెందుకే? అదెంతయినా నీ బంగారం లాంటి శరీరకాంతితో పోటీ పడగలదా ఏమన్నానా!
నీ మనోజ్ఞమైన ఆ వేళ్ళకు అన్నేసి ఉంగరా లెట్టావేమే? ఆ ఉంగరాలకున్న ఆ వెఱ్ఱిమణులన్నీ కలిసి నీ వేలి గోరునుకూడా పోలవే!

తలలో ఆ సవర మెట్టావెందుకే? యెంత అందమైన సవరమైనా నీ కొప్పుకి సాటొస్తుందా ఏమన్నానా!
ఇంకా ఆ రుచులు అన్నీ చూస్తూ ఉన్నావెందుకే? చక్కనైన ఆ వెంకటపతి కెంపువంటి పెదవుల చవికంటే రుచైనవి కావుగదా!

ఎంత సుందరమైన లలితమైన భావనలు!

No comments: