Sunday, January 4, 2009

వెలినుండి లోనుండి వెలితిగాకుండి



కాంభోది
వెలినుండి లోనుండి వెలితిగాకుండి
వెలి లోను పలుమారు వెదకేవె గాలి. IIపల్లవిII

పండువెన్నెలలకునుఁ బ్రాణమగు గాలి
నిండుఁగొలఁకులలోన నెలకొన్న గాలి
బొండుమల్లెలతావిఁ బొడవైన గాలి
యెండమావులఁ బోలితేలయ్య గాలి. IIవెలిII

కొమ్మావిచవికెలోఁ గొలువుండు గాలి
తమ్మికుడుకులఁ దేనె దాగేటి గాలి
యిమ్మయిన చలువలకిరవైన గాలి
గుమ్మరింపుచు వేఁడి గురిసేవె గాలి. IIవెలిII

తిరువేంకటాద్రిపైఁ దిరమైన గాలి
సురతాంతముల జనులఁ జొక్కించు గాలి
తొరలి పయ్యదలలోఁ దూరేటి గాలి
విరహాతురులనింత వేచకువె గాలి. IIవెలిII౫-౨౩౨

చవికెలో=?
కొలఁకుల=సరస్సుల
కుడుకుల=తట్టల
చలువల=ఉతికిన వస్త్రముల

No comments: