|
పాడి
చక్కని తల్లికి చాఁగుబళా తన-
చక్కెరమోవికి చాఁగుబళా. IIపల్లవిII
కులికేటి మురిపెపుఁ గుమ్మరింపుఁ దన-
సళుపుఁ జూపులకు చాఁగుబళా
పలుకుల సొలపులఁ బతితోఁ గసరెడి-
చలముల యలుకకు చాఁగుబళా. IIచక్కనిII
కిన్నెరతోఁ బతి కెలన నిలుచుఁ దన-
చన్ను మెఱఁగులకు చాఁగుబళా
ఉన్నతిఁ బతిపై నొరగి నిలుచుఁ దన-
సన్నపు నడిమికి చాఁగుబళా.IIచక్కనిII
జందెపు ముత్యపు సరులహారముల-
చందనగంధికి చాఁగుబళా
విందయి వేంకటవిభుఁ బెనఁచిన తన-
సందిదండలకు చాఁగుబళా.IIచక్కనిII౫-౧౦౭
No comments:
Post a Comment