కాంభోది
ఇదె మొగంబిదె యద్దమిఁకనేఁటికే మిగులఁ
బదరేవు చెలివద్ద బవళించి నీవు. IIపల్లవిII
పెట్టినది నాయకుని బిరుదు పెనుఁబెండెంబు
కట్టినది యతనిమెడ కంటమాల
యెట్టు బొంకెదవె చెలి యిందాఁక బంగారు-
పట్టెమంచముమీఁదఁ బవళించి నీవు. IIఇదెII
పుట్టినది నాయకుని పొందైన తమ్ములము
చెక్కిటిది పతినొసలి చిన్ని చెమట
యిక్కువెరిఁగియు బొంకనిఁకనేలె చెలియతని-
పక్కనే యిందాక పవళించి నీవు. IIఇదెII
బచ్చెనలు కుచయుగముపై నతని మృగమదము
లచ్చెనలు కొనగోళ్ళలాంఛనములు
ఇచ్చకునిఁ దిరువేంకటాదీశుఁ గూడితివె చెలి
పచ్చలోవరి లోన పవళించి నీవు. IIఇదెII౫-౧౮౪
Thursday, January 1, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment