Monday, December 29, 2008

మూసిన ముత్యానకేలే మొరఁగులు

Get this widget | Track details | eSnips Social DNA




ఆహిరి
మూసిన ముత్యానకేలే మొరఁగులు
ఆసల చిత్తానకేలే అలవోకలు. IIపల్లవిII

కందులేని మోముకేలే కస్తూరి
చిందు నీ కొప్పునకేలే సేమంతులు
మందయానమునకేలే మట్టెలమోఁత
గందమేలే పైపై కమ్మని నీ మేనికి. IIమూసినII

భారపు గుబ్బలకేలే పయ్యెద నీ-
బీరపు చూపులకేలే పెడమోము
జీరల బుజాలకేలే చెమటలు నీ-
గోరంట గోళ్ళకేలే కొనవాండ్లు. IIమూసినII

ముద్దుల మాఁటలకేలే ముదములు నీ-
యద్దపుఁ జెక్కులకేలే అరవిరి
వొద్దిక మాటలకేలే వూర్పులు నీకు-
నద్దమేలే తిరువేంకటాద్రీశుఁ గూడి. IIమూసినII౫-౧౨౫

మొరఁగులు=?
అలవోక=స్వేచ్ఛ,యదృచ్ఛ
అరవిరి=సగము విరిసిన మొగ్గ,ముకుళము

No comments: