Saturday, December 27, 2008

అలరులు గురియఁగ నాడెనదే

Get this widget | Track details | eSnips Social DNA



శంకరాభరణం
అలరులు గురియఁగ నాడెనదే
అలకలఁ గులుకుల నలమేల్ మంగ. IIఅలII

అరవిరి సొబగుల నతివలు మెచ్చఁగ
అరతెర మరఁగున నాడెనదే
వరుస పూర్వదువాళపు తిరుపుల
హరిఁగరఁగింపుచు నలమేల్ మంగ. IIఅలII

మట్టపు మలపుల మట్టెల కెలపుల
కట్టెడి నడపుల దాఁటెనదే
పెట్టిన వజ్రపు పెండెపు తళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేల్ మంగ. IIఅలII

చిందుల పాటల శిరి పొలయాటల
అందెల మోఁతల నాడెనదే
కందువ తిరువేంకటపతి మెచ్చఁగ
అందపు తిరుపుల నలమేల్ మంగ. IIఅలII౫-౨౪

No comments: