మనోహరి
సతులకుఁ బతులకు సహజమిది
తతెరిఁగి యెవ్వరికి తప్పించుకోవసమా. IIపల్లవిII
వలపే చక్కఁదనము వర్ణించి చూచితేను
వలపే సింగారమై వన్నె కెక్కును
వలపే చుట్టరికమై వాడిక సేయుచునుండు
వలపే చవులుసేయు వడిఁ దరితీపులు. IIసతుII
జవ్వనమే చెలువమై సరసము లాడించు
జవ్వనమే భోగమై యాసలురేఁచును
జవ్వనమే పొంతనాలై జంటలుగా చెనకించు
జవ్వనమే వేడుకలై సారెఁ దగిలించును. IIసతుII
ఇచ్చకమే మూలధన మెడయని పొందులకు
ఇచ్చకమే రతులకు నెలయింపులు
ఇచ్చకమే నలమేల్మంగనేలిన శ్రీవేంకటేశ
ఇచ్చకమే మోహనమై ఇంపులు వుట్టించును. IIసతుII ౧౮-౨౯౪
Friday, December 12, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment