Sunday, December 14, 2008

హరియవతార మీతఁడు అన్నమయ్య

శ్రీరాగం
హరియవతార మీతఁడు అన్నమయ్య
అరయ మాగురుఁ డీతఁ డన్నమయ్య. IIపల్లవిII

వైకుంఠనాథునివద్ద వడిఁ బాడుచున్నవాఁడు
ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య
ఆకశపువిష్ణుపాదమందు నిత్యమై వున్నవాఁడు
ఆకడాకడఁ దాళ్ళపాక అన్నమయ్య. IIహరిII

క్షీరాబ్ధిశాయి నిట్టే సేవింపుచునున్నవాఁడు
ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య
ధీరుడై సూర్యమండలతేజమువద్ద నున్నవాఁడు
ఆరీతులఁ దాళ్ళపాక అన్నమయ్య. IIహరిII

యీవల సంసారలీల యిందిరేశుతో నున్నవాఁడు
ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య
భావింప శ్రీవేంకటేశుపాదములందె వున్నవాఁడు
ఆ(హా?)వభావమై తాళ్ళపాక అన్నమయ్య. IIహరిII౨-౧౦౩



ఈ సంకీర్తన అన్నమయ్య అధ్యాత్మ సంకీర్తనలలో చేర్చబడి వుంది.కాని భావమునుబట్టి పెదతిరుమలాచార్యులదో,చిన తిరుమలాచార్యులదో అయివుండవచ్చు.

No comments: