వరాళి
చెప్పనరుదాయఁగదే చెలిసింగారము నేఁడు
వొప్పగుమరుబండార మొనగూర్చినట్లు. IIపల్లవిII
తొడిఁబడ సేమంతులు దురిమెఁ గొప్పునఁ జెలి
కడుఁ జీఁకటీ వెన్నెలాఁ గలసినట్లు
గుడిగొన నొసలఁ గుంకుమతిలకమువెట్టె
యెడయక సూర్యచంద్రు లేకతమాడినట్లు. IIచెప్పII
నెమ్మదిఁ జన్నులమీఁద నీలహారముల్ వేసె
తుమ్మిదలు జక్కవలు దొరలినట్టు
వుమ్మడి నడుమఁ బైఁడి వొడ్డాణము గట్టుకొనె
నెమ్మది మెరువు(పు?)మిన్ను నేస్తముసేసినట్టు.IIచెప్పII
అంచితపుఁ జేకట్లు హస్తముల ధరియించె
యెంచఁ జిగుళ్ళుఁదామర లెనసినట్టు
పొంచి శ్రీవేంకటేశుఁతోఁ బొసఁగె సమరతుల-
నంచల బొమ్మ పెండ్లి యమరినయట్టు. IIచెప్పII ౧౮-౧౮౮
Friday, December 12, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment