Tuesday, December 9, 2008

ఈ గుణాలు మీకె కల విద్దరికిని

లలిత
ఈ గుణాలు మీకె కల విద్దరికిని
చేగదేరఁ బొగడేరు చెలులెల్లా మిమ్మును. IIపల్లవిII

యెగసక్కేలకుఁ బతి యేమేమి సేసినాను
వొగరులాడక వూరకున్నదే సతి
సొగసేయాఁటది యెంత సోఁక సరసమాడినా
వెగటులేకున్న యట్టివిభుడేజాణఁడు. IIఈ గుII

అవల రమణుఁడెంత యగ్గలికఁ దిరిగినా
చవి సేసుకుండేది సకియ
జవరాలు తను నెంతచలము సాధించినాను
అవుఁగాదననివాఁడే అందపు రమణుఁడు. IIఈ గుII

కమ్ముకొని ప్రియుఁడెంత కాఁగిట నలయించినా
సమ్మతించి వుండేది అచ్చపుదేవులు
నెమ్మి శ్రీవేంకటేశ నెలఁత రతి మించినా
నెమ్మది మన్నించితిటు నీవే నాయకుఁడవు. IIఈ గుII ౧౮-౩౬౮

No comments: