మాళవి
ఏమని చెప్పగవచ్చు నిద్దరిజాణతనాలు
కామించి చూడరే కడుఁగన్నులపండుగలు. IIపల్లవిII
యెదురుగొండలెక్కి ఇందిరా నౌభళేశుఁడు
మదము చెక్కిళ్ళఁ గార మాటలాడేరు
పొదిగొన్న వేడుకెంతో పూవులఁ దమలోఁ దాము
చెదరని యాసలతో సేసలు చల్లేరు. IIఏమనిII
రేఁగి రేఁగి భవనాశి రెండుదరులానుండి
మాఁగినమోవులు చూపి మతిఁ జొక్కేరు
తోఁగి తోఁగి చూచుకొంటా తొడిఁబడి రతులకు
దాఁగని ముచ్చటలతోఁ దమకించేరు. IIఏమనిII
సమదిష్టి నొండురులు సంగడివనాలనీడ
జమళికాఁగిళ్ళకు సమకూడేరు
అమర శ్రీవేంకటాద్రి నందూనిందూఁ దావుకొని
చెమటమేనులతోడ సెలవుల నవ్వేరు. IIఏమనిII౧౮-౨౧౦
Wednesday, December 10, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment