Friday, December 26, 2008

తెప్పగా మఱ్ఱాకుమీఁదఁ దేలాడువాఁడు


లలిత
తెప్పగా మఱ్ఱాకుమీఁదఁ దేలాడువాఁడు
ఎప్పుడు లోకములెల్ల నేలేటివాఁడు. IIపల్లవిII

మోఁతనీటి మడుగులో యీఁతగరచినవాఁడు
పాఁతగిలే నూతికిందఁ బాయనివాఁడు
మూఁతి దోసిపట్టి మంటిముద్ద పెల్లగించువాఁడు
రోఁతయైన పేగుల పేరులఁ గలవాఁడు. IIతెప్పII

కోడికూఁతనోరివాని కుఱ్ఱతమ్ముఁడైనవాఁడు
బూడిది పూసినవాని బుద్దులవాఁడు
మాడవన్నె లేటివెంట మాయలఁ దగిలినవాఁడు
దూడల నావులఁ గాచి దొరయైనవాఁడు.IIతెప్పII

ఆకసాన బారేవూరి అతివల మానములు
కాకు సేయువాఁడు తురగముపైవాఁడు
ఏకమై వేంకటగిరి నిందిరారమణిఁ గూడి
యేకాలముఁ బాయని యెనలేనివాఁడు. IIతెప్పII౫-౨౯౫

ఈ సంకీర్తనలో దశావతారాలు వర్ణించబడినాయి

4 comments:

Anonymous said...

Baagundandi Mee Blaagu.

Regards

http://www.varudhini.blogspot.com

Unknown said...

ధన్యవాదములు

vsrao5- said...

మీ కృషి శ్లాఘనీయం. అభినందనలు నరసింహగారు

Anonymous said...

ధన్యవాదములు సాంబశివరావు గారూ!