Monday, December 22, 2008

చల్లనై కాయఁగదొ చందమామా నీ

Get this widget | Track details | eSnips Social DNA


సామంతం
చల్లనై కాయఁగదొ చందమామా నీ
వెల్ల(ల్లి?)గాఁ దిరువేంకటేశునెదుర
మొల్లమిగ నమృతంపు వెల్లి గొల్పుచు లోక-
మెల్ల నినుఁ గొనియాడఁగాను. IIపల్లవిII

పొందైన హితులు నాప్తులు రసికులును గవులు
నందమగు నునుమాటలాడ నేర్చిన ఘనులు
చిందులకు నాడేటి సీమంతినీ మణులు
చెలఁగి యిరుగడఁ గొలువగాను

వందిమాగథులు గైవారింపఁ దనదివ్య-
మందిరోపాంత ఘనమార్గమునఁ గోనేటి-
ముందటను మంద మందప్రయాణములతో-
నిందిరాపతి మెరయఁగాను. IIచల్లనైII

ఏకాంత సుఖగోష్ఠినింపొంద మానవా-
నీకంబులెడఁ గలసి నిలిచి సేవింపఁ గాం-
తాకదంబముల(లు?) హస్తముల కంకణఝుణ-
త్కారములు నిగుడఁ జామరములిడఁగ
జోకైన మణిగణస్తోమాంకితంబులై
సొంపొందు నాలవట్టములు గరములఁ దాల్చి
యేకాంతులిరువంక నెదిరి కొలువఁగ సకల-
లోకేశ్వరుఁడు మెరయఁగాను. IIచల్లనైII

బంగారు ప్రతిమలకు ప్రతులైన దివిజలో-
కాంగనలు ఘనవిమానాంగణంబుననుండి
చెంగలువలును మంచిసేవంతిరేకులును
చెలఁగి యిరుగడఁ జల్లఁగాను
మంగళాత్మకములగు మహితవేదాంత వే-
దాంగవిద్యలకు ప్రియమంది చేకొనుచుఁ దిరు-
వేంగళేశ్వరుఁడు గడు వేడుకలతోడఁ దిరు-
వీథులను విహరించఁ గాను. IIచల్లనైII

౫-౨౨౮

No comments: